తెలంగాణ సోనా బియ్యానికి ఫుల్‌ డిమాండ్‌ ?

Chakravarthi Kalyan
తెలంగాణ సోనా బియ్యానికి డిమాండ్‌ పెరుగుతోంది. దేశంలో పలు ప్రాంతాల్లో తెలంగాణ సోన - ఆర్‌ఎన్‌ఆర్‌-15048 వరి రకం బియ్యం మార్కెటింగ్ చేసేందుకు బళ్లారికి చెందిన మల్లికార్జున రైస్ ఇండస్ట్రీస్ సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2 ఏళ్లపాటు అమలులో ఉంటుంది.
ఈ  ఒప్పంద పత్రాలపై మల్లికార్జున రైస్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు మల్లికార్జున్, మంజునాథ, వ్యవసాయ విశ్విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్‌కుమార్‌ సంతకాలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం రూపొందించిన తెలంగాణ సొన రకం బియ్యం తక్కువకాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా పలు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యం పొందిందని..  అన్ని వర్గాల ప్రజలు ఆ అన్నం తినేందుకు ఇష్టపడుతున్నారని డాక్టర్ సుధీర్‌ కుమార్ అన్నారు. మొత్తానికి తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ బియ్యానికి డిమాండ్‌ పెరుగుతోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: