ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం కనపడకపోయినా, తెలుగు ప్రజల ఐక్యతకు, సామరస్యానికి చిహ్నంగా భావించే తెలుగు తల్లి కనపడకపోయినా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నోరు మెదపట్లేదని ఏపీ బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే తెలంగాణ గురించి మాట్లాడాలంటేనే జగన్‌కు భయమని ఏపీ బీజేపీ నేతలు అన్నారు. తన మాటల వల్ల కేసీఆర్ కి కోపం వస్తే హైదరాబాద్లోని తన ఆస్తులకు భద్రత ఉండదనే భయంతోనే జగన్ నోరు మెదపడం లేదని... సీబీఐ, ఈడీ పదేళ్ల నుంచి విచారణ చేస్తున్న జగన్ అక్రమాస్తుల కేసులు కూడా తెలంగాణ హైకోర్టులోనే ఉన్నాయని... కాబట్టి తనపై కేసీఆర్‌కు కోపం వస్తే తనకి నష్టం కాబట్టి జగన్ మౌనంగా ఉన్నాడని ఏపీ బీజేపీ నేతలు అన్నారు.
నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ అయిన తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలు ఎక్కడున్నాయో తెలియదని... ఆంధ్రా సంస్కృతిని, ఆంధ్ర నాయకులను, చిహ్నాలను అవమానించడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్, కేటీఆర్, విగ్రహాల చోరీపై మౌనంగా చోద్యం చూస్తున్న జగన్ తక్షణమే తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పి, ఆ రెండు విగ్రహాలను పునః ప్రతిష్టింపచేయాలనేదే మాపార్టీ బీజేపీ డిమాండ్ అని తెలిపారు.