తనపై కేసుల లెక్కలు అడుగుతున్న చంద్రబాబు?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు నాపై ఏమైనా కేసులున్నాయా..? అని డీజీపీకి లేఖ రాయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. అంతకు ముందు వరకు నాపై ఎలాంటి కేసులు లేవని.. నాపై కేసులు పెట్టేందుకు ఎవ్వరూ సాహసించ లేదని అంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు నాపై ఎన్ని కేసులున్నాయో నాకే తెలీదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో 175నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులకు లీగల్ సెల్ సహకారం ఎంతో అవసరం అంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎమ్మెల్సీ ఎన్నికల్ని న్యాయవాదులు సవాల్ గా తీసుకుని అక్రమాలు అరికట్టాలని సూచిస్తున్నారు.

రావణున్ని యుద్దంలో ఓడించడానికి రాముడొక్కడే చాలని.. కానీ ధర్మ పరిరక్షణ కోసం రాముడు అందరి  సాయం తీసుకున్నారని.. ఉడుత కూడా ధర్మ పరిరక్షణ కోసం సాయం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. నాలుగేళ్లల్లో విశాఖలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వానికి లాయర్ల అవసరం ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక టీడీపీ లీగల్ సెల్ లాయర్ల సేవలు వినియోగించుకుంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: