
ఆ విషయంలో జగన్ కంటే బాబే బెటర్?
గత ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 50 శాతం మేర వేతనాలు పెంచారని బొప్పరాజు వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. ఉద్యోగులు వేరు కాదు ప్రభుత్వంలో భాగస్వామి అన్నప్పుడు ఆర్ధిక శాఖ మాకు లెక్కలు ఎందుకు చెప్పటం లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఉద్యోగులకే లెక్కలు తెలీక పోతే ప్రజలకు ఏం చెబుతారన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ఉద్యోగుల వేతనాలు సరైన సమయానికి ఖాతాల్లో జమ అవుతున్నాయో లేదో తెలీని పరిస్థితి ఉందన్నారు. ఏ మొత్తాన్ని జమ చేస్తున్నారు.. ఏ మొత్తాన్ని వెనక్కు తీసుకుంటున్నారో అర్ధం కావటం లేదన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు.. వీఆర్ఏ లాంటి చిన్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వం డీఏను చెల్లించలేరా అని ప్రశ్నించారు.