అదానీ - హిండెన్‌బర్గ్ వివాదంపై రేపు సుప్రీంకోర్టు తీర్పు?

Chakravarthi Kalyan
అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని దాఖలైన పలు పిటిషన్లపై రేపు  విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కాంగ్రెస్‌ నాయకురాలు జయా ఠాకూర్‌ వేసిన పిటిషన్‌నూ రేపు విచారణ చేసేందుకు అంగీకరించింది. అత్యవసరంగా విచారణ జరపాలని జయా ఠాకూర్‌ తరఫు న్యాయవాది కోరారు. ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ PS నరసింహ అందుకు అంగీకరించారు.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూపు కంపెనీలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్‌ నేత జయా ఠాకూర్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. తొలుత ఆ పిటిషన్‌ను 24న విచారిస్తామని సుప్రీంకోర్టు  పేర్కొంది. అయితే మరో 2పిటిషన్లు ఈనెల 17న విచారణకు రానున్నాయని జయ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొన్న జయ వ్యాజ్యంపైనా రేపే విచారణ జరిపేందుకు అంగీకరించింది. మరి సుప్రీం ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: