ఏపీలో అమ్మకానికి పోలీస్ ఉద్యోగాలు.. నిజమేనా?
6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్న హోంమంత్రి తానేటి వనిత.. ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి పారదర్శకంగా, సజావుగా జరిగాయని అన్నారు. అభ్యర్థులు వారి ప్రతిభ, తెలివితేటలు, మెరిట్ ఆధారంగానే ఉద్యోగం పొందుతారని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారిని నమ్మి మోసపోవద్దని హోంమంత్రి తానేటి వనిత హెచ్చరించారు. అయితే.. ఉట్టి మాటలతో కాకుండా.. ఇలాంటి వారికి గట్టి జవాబు చెప్పాలి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకునే వారికి బిగ్ షాక్ ఇవ్వాలి.