స్టార్టప్‌ స్టాండప్‌: హైదరాబాద్‌లో కీలక సదస్సు?

Chakravarthi Kalyan
నేటి నుంచి రెండురోజులపాటు హైదరాబాద్ లో స్టార్టప్ 20 సదస్సు జరగనుంది. అంకుర సంస్థల పటిష్ట వ్యవస్థ రూపకల్పనపై జీ-20 సభ్యదేశాల ప్రతినిధుల చర్చించనున్నారు. జీ-20 కూటమికి దేశం నాయకత్వం వహిస్తున్న వేళ... సభ్యదేశాల ప్రతినిధులతో హైదరాబాద్ వేదికగా జీ-20 స్టార్టప్ ఎంగేజ్ మెంట్ గ్రూపు సదస్సు నిర్వహిస్తోంది. ఇవాళ్టి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో... స్టార్టప్‌ సంస్థల అభివృద్ధికి సహకారం అందించడం, పరిశ్రమలతో కలిసి అంకుర సంస్థలు పనిచేసే అవకాశాలు, అంకుర సంస్థ రంగంలో పనిచేస్తున్న సంస్థల మధ్య సమన్వయంపై ప్రపంచవ్యాప్తంగా ఒక పటిష్టమైన వ్యవస్థను రూపొందించనున్నారు.

నేటి నుంచి రెండు రోజులపాటు స్టార్టప్ 20 ఎంగేజ్ మెంట్ గ్రూపు సమావేశాన్ని నిర్వహిస్తోంది. స్టార్టప్ సంస్థలకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఈ సదస్సు ఉద్దేశంగా చెబుతున్నారు. ఇందుకోసం జి-20 సభ్యదేశాల ప్రతినిధులతోపాటు తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులు, పలు అంకుర సంస్థల వ్యవస్థాపకులు హాజరవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

G20

సంబంధిత వార్తలు: