విజయశాంతికి 25 ఏళ్లు.. బీజేపీ స్పెషల్ ప్రోగ్రామ్‌?

Chakravarthi Kalyan
ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి రాజకీయాల్లోకి ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మొదట్లో తల్లి తెలంగాణ పార్టీ పెట్టిన ఆమె.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరి ఎంపీ కూడా అయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఏ పార్టీలోనూ లేని ఆమె ఇప్పుడు బీజేపీ నేతగా ఉన్నారు. ఆమె రాజకీయ జీవితానికి 25 ఏళ్లు అయిన సందర్భంగా 25 సంవత్సరాల ప్రయాణం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమంలో బండి సంజయ్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, జితేందర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొంటారు. పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్‌ పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: