తెలంగాణ రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ ద్వారా భారత రాష్ట్ర సమితి మోసపూరిత పాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమంటోంది కాంగ్రెస్. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల అరాచకాలపై ఛార్జి షీట్ విడుదల చేస్తానంటోంది. బీఆర్‌ఎస్ అంటే బందిపోట్ల సమితి అని, బీజేపీ అంటే బ్రష్ట్ జుమ్లా పార్టీ అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇలా అనేక హామీలు బుట్టదాఖలయ్యాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు ఊసే బీఆర్‌ఎస్ ప్రభుత్వ మరచిపోయిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
ధనికుల కోసమే కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సామాన్యుడి బతుకు భారంగా మారిందని, రైతులు, పేదల గురించి మోడీ పట్టించుకోలేదని కేవలం సన్నిహితులకు దోచి పెట్టడమే ధ్యేయంగా పని చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఏఐసీసీ షెడ్యూల్ మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి 119 నియోజక వర్గాలల్లో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం మొదలుకానుంది.