షాకింగ్‌: జోషీమఠ్‌లో మొత్తం భవనాలు కూల్చివేత?

Chakravarthi Kalyan
ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌.. ఇటీవల బాగా వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ భూమి కుంగుతోంది. ఇలా భూమి కుంగి.. జోషీమఠ్‌లో భూమి పగుళ్లతో భవనాలకు ముప్పు వాటిళ్లుతోంది. దీంతో ప్రభుత్వం 678 భవనాలు ప్రమాదకరంగా మారినట్లు గుర్తించింది. హైరిస్క్‌ జోన్‌లో ఉన్నభవనాలు కూల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా రెండు హోటళ్లు కూల్చివేసేందుకు ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.


అయితే.. ముందస్తు సమాచారం ఇవ్వకపోవటంపై హోటల్ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒన్‌ టైం సెటిల్‌మెంటు ప్రకారం పరిహారం ఇవ్వాలని హోటల్ యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. జోషీమఠ్‌లో భూ క్షీణత వల్ల పగుళ్లు రావటంతో.......నివాస, వ్యాపార సముదాయ భవనాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. హైరిస్క్‌ జోన్‌లో ఉన్న నిర్మాణాలను కూల్చి వేయాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది. అంతే కాదు.. ఈ అంశంపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు మాత్రం నిరాకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: