నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వెళ్తున్నారా.. మీకో మెట్రో గుడ్‌న్యూస్‌

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో నుమాయిష్ సందడి మొదలైంది. ఈ భారీ ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 15 వరకూ కొనసాగుతుంది. దేశంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్‌లలో ఒకటైన ఈ ప్రదర్శన కోసం ఇప్పుడు మెట్రో కూడా తన పని వేళలు పెంచుకుంది. నుమాయిష్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించారు. అర్ధరాత్రి 1 గంటల వరకు మెట్రో రైలు సేవలు పొడిగించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.


ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గ్ మార్గాల్లో మెట్రో రైళ్ల సమయం పొడిగిస్తున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. టెర్మినల్ స్టేషన్ల నుండి అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభం కానున్న చివరి రైళ్లు... గంట లోపు గమ్యస్థానానికి చేరుకుంటాయని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. నుమాయిష్ రద్దీని దృష్ట్యా గాంధీభవన్ మెట్రో స్టేషన్‌లో టికెట్ బుకింగ్ కౌంటర్ల పెంచారు. సాధారణంగా ఉన్న నాలుగు కౌంటర్లతో పాటు అధనంగా మరో రెండు కౌంటర్ల ఏర్పాటు చేసినట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. ఈ కారిడార్లలో ఫిబ్రవరి 15 తేదీ వరకు అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు ఉంటాయని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: