జనవరి 3న అంటే.. రేపు సీఎం వైయస్ జగన్ రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఆయన పింఛను పెంపు వారోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడతారు. ఇప్పటికే రాష్ట్రంలో నూతన సంవత్సరం రోజు తెల్లవారుజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పండుగ ప్రారంభమైంది. కొత్త సంవత్సరంతో పాటే రాష్ట్రంలో పింఛన్ వారోత్సవాలు కూడా ప్రారంభం అయ్యాయి. లక్షలాది మంది అవ్వా తాతలు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఫించన్ల పంపిణీ మొదలైంది. వారి ఇళ్లలో కొత్త వెలుగులు ఫించన్ల రూపంలో వచ్చాయి.
గతంలో ప్రతి నెలా రూ.2,500 చొప్పున అందుకుంటున్న పింఛను డబ్బులు జనవరి నుంచి నుంచి ప్రతి నెలా రూ.2,750 చొప్పున అందుకుంటున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం పెంచిన పెన్షన్ మొత్తం 2,750 రూపాయలు వాలంటీర్లు లబ్ధిదారులకు స్వయంగా అందిస్తున్నారు. అంతే కాదు.. ఈ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 2,31,989 మందికి వైయస్ జగన్ ప్రభుత్వం కొత్తగా పింఛన్ల సౌకర్యం కల్పించింది.