ఉజ్బెకిస్తాన్ పసి పిల్లల ప్రాణాలు తీసిన భారత మందు?
ఉజ్బెకిస్తాన్ ఆరోపణలతో మరియన్ బయోటెక్ ఫార్మాలో కేంద్ర సంస్థ బృందాలు, ఉత్తరప్రదేశ్ ఔషధ విభాగం తనిఖీలు నిర్వహించాయి. అయితే.. ఈ సిరప్‌ను భారత్‌లో విక్రయించటం లేదని మరియన్ బయోటెక్ తెలిపింది. కేవలం ఉజ్బెకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నట్లు మరియన్ బయోటెక్ తెలిపింది. ఈ ఘటనపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణా సంస్థ కూడా దర్యాప్తు ప్రారంభించింది. అయితే.. తమవైపు నుంచి ఎలాంటి సమస్య లేదని మరియన్ బయోటెక్ చెబుతోంది. పదేళ్లుగా ఉజ్బెకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్నట్లు మరియన్ బయోటెక్ ప్రతినిధి చెప్పారు.