ఆ స్వామీతో రాష్ట్రపతి ముర్ము భేటీ?

Chakravarthi Kalyan
ముచ్చింతల్ లోని సమాతమూర్తి స్ఫూర్తి కేంద్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 5:15 గంటలకి ప్రత్యేక విమానంలో హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గెస్ట్ హౌస్ కి ముర్ము చేరుకుంటారు. అక్కడ నుండి ప్రత్యేక వాహనంలో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం గేట్ నెంబర్ 3 వద్దకు రాష్ట్రపతి చేరుకుంటారు. అక్కడ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి రాష్ట్రపతికి స్వాగతం పలుకుతూ నేరుగా 108 దివ్యసాలు సందర్శిసారు. ఆ తర్వాత 216 రామానుజ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసి అక్కడ నుండి రామానుజన్ స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటారు.
అక్కడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి త్రిదండి చిన్న జీయర్ రామానుజ స్వామి మంగళ శాసనాలు  ఇస్తారు.. ఆ తరువాత  రాష్ట్రపతి డైనమిక్ ఫౌంటైన్ షో తిలకిస్తారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ త్రీడీ లేజర్ షో  చుసిన  తరువాత  సందర్శకులని, భక్తులని, దేశ ప్రజలని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: