ఇది పేదలకు నిజంగా శుభవార్తే.. ఇక గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో త్వరలో గుండె శస్త్రచికిత్సలు మళ్లీ జరగబోతున్నాయి. గతంలో నిలిచిపోయిన గుండె ఆపరేషన్లు మళ్లీ చేపట్టాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన ఆళ్ల గోపాలకృష్ణకు మరోసారి ఈ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలోని వైద్యుల బృందం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని ఆమె ఛాంబర్ లో కలిసి ఈ అంశాలపై చర్చించారు. ఈ మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గుండె శస్త్రచికిత్స విభాగం నిపుణులు సమాయాత్తమవుతున్నారు.
శస్త్రచికిత్స మందిరాల్లో వసతులు.. రోగులకు అవసరమైన వార్డులు ఏ విధంగా సమాకూర్చాలన్న అంశాల గురించి చర్చించినట్లు డాక్టర్ ప్రభావతి చెబుతున్నారు. ఆపరేషన్ల కోసం అవసరమైన పరికరాలు, సిబ్బంది నియామకాలు, ఔషధాలు అందుబాటులో ఉంచాలన్న విషయాలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా డాక్టర్ కుప్పుస్వామిను నియమించారు.