భార్య, కుమార్తె పైనా అసభ్యకర పోస్టులా.. వైసీపీ నేత ఆవేదన?

Chakravarthi Kalyan
రాజకీయాలు దిగజారుతున్నాయి. సోషల్ మీడియా నేపథ్యంలో ఇది మరీ ముదురుతోంది. ఇప్పుడంతా సోషల్ మీడియా ద్వారానే రాజకీయ పోరు సాగుతోంది. అయితే.. ఈ సోషల్ పోరులోకి నేతల కుటుంబ సభ్యులను కూడా లాగడం వివాదాస్పదం అవుతోంది. తాజాగా తన భార్య, కుమార్తె పైన కూడా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం మంచిది కాదన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తన భార్య, కూమార్తెపై పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా అభిమానులకు ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాను..  మీరు రెచ్చి పోయి గొడవలు చేయవద్దని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నా అభిమానులను రెచ్చగొట్టి గొడవలు చేయించేందుకు కొందరు ప్రత్యర్ధులు చేస్తున్న కుట్రలో భాగంగానే అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఐదు సర్వేల్లో గెలుపునాదేనని ఫలితాలు వచ్చాయని.. సమస్యలు వస్తే న్యాయపోరాటం చేద్దాం..అంతేకా ని గొడవలకు వెళ్ళవద్దని కోటంరెడ్డి పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: