బాబోయ్.. రాజాసింగ్ ప్రాణాలకే ప్రమాదం?
4 నెలల క్రితం రహదారి మధ్యలో వాహనం ఆగిపోతే ఇంటిలిజెన్స్ కార్యాలయానికి పంపించానని.. మరమ్మతులు చేసి తిరిగి అదే వాహనాన్ని ఇచ్చి పంపారని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. 2నెలల క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలోనూ ఆగిపోయిందని.. అంగరక్షకుల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లానని ఆయన వివరించారు. తాజాగా అఫ్జల్ గంజ్ వద్ద మరోసారి వాహనం ఆగిపోయిందని.. సొంత వాహనం పిలిపించుకొని వెళ్లానని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఉగ్రవాదుల నుంచి దాడులు పొంచి ఉన్న నాకు ఇంటిలిజెన్స్ అధికారులు ఇలాంటి వాహనం ఇచ్చారుని ఎమ్మెల్యే రాజాసింగ్ వాపోయారు.