మంత్రి రోజా ఇంటి ముందు తొడగొట్టిన జనసేన నేత?

Chakravarthi Kalyan
మంత్రి రోజా ప్రమేయంతో నగిరి పోలీస్ స్టేషన్‍ లో తనను నిర్బంధించారని జనసేన నాయకుడు కిరణ్‍ రాయల్‍ ఆరోపిస్తున్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. తనను నెంబర్ లేని వాహనంలో... తనపై దాడి చేస్తూ ఓ టెర్రరిస్టును తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారని జనసేన నాయకుడు కిరణ్‍ రాయల్‍ ఆవేదన వ్యక్తం చేశారు.


రాజకీయంగా ఏదైనా ఉంటే ముఖాముఖి చూసుకోవాలని  ఇలా తన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి అయ్యేలా తీసుకెళ్లడం సమంజసమా అని జనసేన నాయకుడు కిరణ్‍ రాయల్‍ ప్రశ్నించారు. స్టేషన్ కి తీసుకెళ్లిన పోలీసులు ఏ కేసు పెట్టాలో కూడా తెలియకుండా దాదాపు పది పేపర్లు రాసి చించారని జనసేన నాయకుడు కిరణ్‍ రాయల్‍ అన్నారు. చివరికి నాన్ బైయిలబుల్ కేసును నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారని తెలిపారు.  మంత్రి రోజాపై అధికార, చట్ట దుర్వినియోగం కేసు పెడతామన్న జనసేన నాయకుడు కిరణ్‍ రాయల్‍.. విడుదలయ్యాక ర్యాలీ నిర్వహించి.. మంత్రి రోజా ఇంటి ముందు తొడగొట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: