జగన్ పై అలీ సంచలన వ్యాఖ్యలు..?

Chakravarthi Kalyan
సినీ నటుడు అలీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా అలీ వైసీపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు స్వీకరించారు.  2024లో ప్రజలు మళ్లీ సీఎం వైయ‌స్ జగన్‌కు పట్టం కట్టడం ఖాయ‌మ‌ని అలీ దీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ఓ మనసున్న నాయకుడని.. ప్రజలకు ఏం కావాలో అన్నీ చేస్తున్నార‌ని అలీ తెలిపారు.

తనపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి న్యాయం చేస్తానని అలీ తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ సీఎం వైయ‌స్ జగన్‌ నెరవేర్చారని అలీ అన్నారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అలీ అన్నారు. రోడ్ల విస్తరణ అనేది అన్ని చోట్లా జరిగేదేనని.. అందరం అభివృద్ధిని కాంక్షించాలని అలీ అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు హర్షించాల‌ని నటుడు అలీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: