పోలీసు సిబ్బందే అన్యాయం చేసిన సంఘటన విజయవాడ కృష్ణలంకలో జరిగింది. కృష్ణలంక పోలీసుస్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వెంకట సుబ్బారెడ్డి హోంగార్డ్ ఉద్యోగాలిప్పిస్తామని పలువురి నుంచి లక్షల రూపాయల్లో నగదు వసూలు చేశాడు. దీనిపై బాధితులు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన ఖాదర్ వలి, విజయవాడ వైఎస్సార్ కాలనీకి చెందిన శరత్ చంద్ర నుంచి 18 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు ఫిర్యాదు చేశారు. నమ్మకంగా మాటలు చెప్పి డబ్బులు తీసుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు . కష్టపడి సంపాదించి కూడబెట్టిన సొమ్మును ఉద్యోగం వస్తుందంటే నమ్మి ఇచ్చామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ.. కొన్నాళ్లుగా సుబ్బారెడ్డి విధులకు హాజరుకావట్లేదని అధికారులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ ఐఆర్ ను వన్ టౌన్ కు బదిలీ చేశారు.