ఆ టీచర్లకు.. జగన్ బ్యాడ్ న్యూస్?
ఎలాంటి పోస్టులు రద్దు చేయబోమని ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినా.. ఇప్పుడు ఈ పోస్టులు రద్దయ్యాయి. గతేడాది కూడా అక్టోబరులో ఐదుగురు అదనపు డైరెక్టర్ల కోసం 15 పోస్టులను రద్దు చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,160 పోస్టులను రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఈ విభాగాల్లో ఇంకా 840 పోస్టులు మాత్రమే మిగిలినట్టు సమాచారం. ఈ పోస్టుల్లో 350 పోస్టుల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్నారు. వీటికి అదనంగా పోస్టులు వస్తాయనుకుంటే ఇప్పటికే ఉన్న పోస్టులను రద్దు చేయడమేంటని ఉపాధ్యాయులు అంటున్నారు.