భారత్లో బ్రిటన్ మంత్రి ఆస్తులు కబ్జా చేసేశారు?
ఈ విషయం గురించి సుయెలా తండ్రి క్రిస్టీన్ ఫెర్నాండెజ్ గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర గోవాలోని అసగావ్ గ్రామంలో బ్రిటన్ హోం మంత్రి సుయోలా బ్రావెర్మన్ కు ఆస్తులు ఉన్నాయట. వీటిలో 14 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే రెండు ప్లాట్లు కూడా ఉన్నాయట. వాటిని గుర్తు తెలియని వ్యక్తి పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఆక్రమించారట. ఆస్తుల ఆక్రమణ గురించి క్రిస్టీన్ కు ఆగస్టులోనే సమాచారం అందిందట. ఆయన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ , రాష్ట్ర డీజీపీ జస్పాల్ సింగ్ కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.