లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటున్నారా.. మీకో గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు పెరిగాయి. వీటిలో చాలా వరకూ కులాంతర వివాహాలే ఉంటాయి. కొన్ని ఏకంగా మతాంతర వివాహాలు కూడా ఉంటాయి. సమాజంలో కుల వివక్ష రూపుమాపేందుకు ప్రభుత్వాలు కూడా ఈ కులాంతర ప్రేమ వివాహాలను ప్రోత్సహిస్తాయి. తాజాగా ఏపీ సర్కారు.. అక్టోబరు 1 తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో పెళ్లి కానుక పథకాలు అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.


సంక్షేమ శాఖలు రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం అనుమతించింది. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం... వైఎస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీలకు రూ. 1 లక్ష మేర పెళ్లి కానుక ఇవ్వున్నారు. అయితే.. కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు అంతకు మించి.. రూ.1.20 లక్షలు ఇవ్వన్నారు. అలాగే ఎస్టీలకు రూ. 1 లక్ష, కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీలకు రూ. 1.20 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదించారు. అదే బీసీలకు రూ. 50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ. 75 వేలు ఇస్తారు. మైనార్టీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 1 లక్ష, విభిన్న ప్రతిభావంతులకు వైఎస్సార్ కళ్యాణమస్తు కింద రూ. 1.50 లక్షల మేర పెళ్లి కానుక ఇవ్వనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: