బియ్యం ధరలు పెరుగుతాయా.. ఎందుకంటే?
దేశీయ మార్కెట్‌లో బియ్యం కొరత రాకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ట్రక్కుల్లోకి లోడింగ్ ప్రారంభమైన, నౌకాశ్రయాలకు చేరిన నూకల ఎగుమతులను మాత్రం ఆంక్షల పరిధి నుంచి మినహాయించింది. గోదాముల్లో గోధుమలు, బియ్యం నిల్వలు తగ్గాయని ఇటీవల వార్తా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనాలను అధికారులు కూడా అంగీకరిస్తునత్నారు. గోధుమ నిల్వలు 14ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. బియ్యం నిల్వలు కూడా గణనీయంగా పడిపోయాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు గణనీయంగా తగ్గింది.