ఇండియాకే షాకింగ్ న్యూస్.. ఆకలికేకలేనా?

Chakravarthi Kalyan
దేశంలో కొన్ని సంవత్సరాలుగా ఆహార నిల్వలు పేరుకుపోతున్నాయి. ఎఫ్‌సీఐ గోదాములు నిండిపోతున్నాయి.అయితే.. ఇప్పుడు సీన్ మారిందట. ఈ ఏడాది ఖరీఫ్‌లో బియ్యం దిగుబడి 10 నుంచి 12 మిలియన్ టన్నులు తగ్గబోతోందట. ఈ విషయాన్ని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం తగ్గడమే ఇందుకు కారణంగా ఆహార, ప్రజా పంపిణీ విభాగం తెలిపింది. ఈ సీజన్‌లో ఏకంగా వరిసాగు 38 లక్షల హెక్టార్ల మేర తగ్గిందట.


ఇలా ఎందుకు జరిగిందంటే.. చాలా రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదు అయ్యిందట. అందువల్లే పంట విస్తీర్ణం బాగా పడిపోయిందట. వర్షాలు సాధారణ స్థాయిలో ఉన్న రాష్ట్రాల్లో వరి దిగుబడి పెరిగే అవకాశం ఉందట. అదే జరిగితే బియ్యం దిగుబడిలో తగ్గుదల పరిమితమయ్యే అవకాశం ఉందని కేంద్రం చెబుతోంది. కరోనా సంక్షోభం వేళ  కేంద్రం ప్రారంభించిన ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించే అంశంపై మాత్రం కేంద్రం క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్‌ అన్నయోజన పథకం గడువు సెప్టెంబర్ 30తో పూర్తి కాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: