హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త... ఇవాళ హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా ఇవాళ మెట్రో రైళ్ల సమయం పొడిగిస్తున్నట్టు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. ఇవాళ ఉదయం 6 నుంచి ప్రారంభమైన మెట్రో సర్వీసులు ఈ అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగుతాయి. చివరి స్టేషన్ నుంచి అర్ధరాత్రి ఒంటి గంటకు చివరి మెట్రో రైలు బయలు దేరుతుందని హైదరాబాద్ మెట్రో ఓ ప్రకటలో తెలిపింది.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం అంటే.. ఓ రేంజ్‌లో జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఆ నిమజ్జనం సందడిని తిలకించేందుకు కూడా భక్తులు పెద్దఎత్తున ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకుంటారు. దీంతో పాటు ట్యాంక్ బండ్ వద్ద మాత్రమే కాకుండా ఇంకా అనేక చోట్ల నిమజ్జనాలు జరుగుతున్నాయి. అన్నిచోట్లకూ రవాణా కోసం హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది.