స్పాట్‌లోనే ఆఫీసర్‌ను సస్పెండ్ చేసిన విడదల రజిని?
గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి నిర్వహణ లోపంపై వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ఆశయంతో పనిచేస్తుంటే... ప్రజలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తుంటే... క్షేత్ర స్థాయిలో సిబ్బంది మరింత బాధ్యతగా పనిచేయాలని వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజని అన్నారు. వైద్యాధికారిపై స్థానికంగా ఆరోపణలు రావడం.. లైంగిక వేధింపులు, ఆస్పత్రికి సరిగా రాకపోవడం, ఆస్పత్రి వేళ్లలో ప్రైవేటు ప్రాక్టీసు చేస్తుండటం, ఏఎన్ ఎంలను వేధిస్తుండటం వంటి ఆరోపణలు మంత్రి దృష్టి వచ్చాయి. వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజని వెంటనే ఆ అధికారిని సస్పెండ్ చేశారు.