గుడ్ న్యూస్.. ఆ ఫోన్లపై నిషేధం లేదట?

Chakravarthi Kalyan
తక్కువ ధర ఉన్న చైనా ఫోన్లను నిషేధిస్తారని దేశంలో కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి రూ. 12వేలు స్థాయిలో ధర ఉన్న చైనా కంపెనీల స్మార్ట్‌ ఫోన్లపై కేంద్రం నిషేధం విధించనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఎందుకంటే.. దేశంలో విక్రయించే స్మార్ట్‌ఫోన్లలో మూడోవంతు ఫోన్లు 12వేలలోపు విలువైనవే. అందులోనూ చైనా మొబైల్‌ తయారీ కంపెనీలకు ఈ మార్కెట్‌లో 80 శాతం వాటా ఉంది.

అయితే.. ఇప్పుడు ఈ వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. చైనాకు చెందిన తక్కువ ధర స్మార్ట్ ఫోన్లు నిషేధించే ఆలోచనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఎలాంటి విదేశీ బ్రాండ్లను మినహాయించే ఉద్దేశమేదీ లేదని కేంద్ర వర్గాలు  తెలిపాయి. ఒకవేళ పోటీ కంపెనీల అక్రమ వ్యాపార పద్ధతుల వల్ల భారతీయ కంపెనీలకు నష్టం వాటిల్లితే మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: