జగన్ ప్రోగ్రెస్ రిపోర్టు చేతబట్టిన విడదల రజని?
తాజాగా... వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజని పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. సాతులూరు గ్రామంలో గ్రామస్తులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు మంత్రి విడదల రజినికి ఘనంగా స్వాగతం పలికారు. మూడేళ్ల పాలనలో సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలను మంత్రి విడదల రజిని ప్రతి గడపకు వెళ్లి మంత్రి వివరించారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టు కాపీని పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి విడదల రజిని.. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు ప్రజలకు తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామని మంత్రి విడదల రజిని తెలిపారు.