అయ్యో.. అమితాబ్‌కు మళ్లీ కరోనా?
అమితాబ్ గతంలోనూ కరోనా బారిన పడ్డారు. 2020లో అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. అంతా త్వరలోనే కోలుకున్నారు. అయితే అమితాబ్ కు మాత్రమే రెండోసారి కరోనా వచ్చింది. అమితాబ్ బచ్చన్‌కు కరోనా రావడంతో ఆయన షూటింగ్స్ నిలిచిపోయాయి. ఆయన కౌన్ బనేగా క్రోర్‌పతి కొత్త సీజన్ షూటింగ్‌లో నిన్న మొన్నటి వరకూ బిజీగా ఉన్నారు. అంతే కాదు.. రణ్‌బీర్ కపూర్, అలియాభట్ నటిస్తున్న బ్రహ్మస్త్రలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.