షా ఎఫెక్ట్‌: ఎన్టీఆర్‌పై పవన్‌ కల్యాణ్‌ జెలసీ?

Chakravarthi Kalyan
తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ భేటీపై అనేక విధాలుగా విశ్లేషణలు వచ్చాయి. అయితే.. జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ కావడం పవన్ కల్యాణ్‌కు కోపం తెప్పించిందా.. ఆయన ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీపై జెలసీగా ఫీలవుతున్నారా.. అంటే అవునంటున్నారు వైసీపీ నేతలు.


అందుకే పవన్ కల్యాణ్‌.. రెండు రోజులుగా ఫ్రస్టేషన్‌గా ఉన్నారని.. ఏదేదో మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తననుకాక, మరో సినీ నటుడ్ని నిన్న  అమిత్ షా కలవటంతోనే పవన్ కల్యాణ్ కు ఇక టీడీపీ వైపు వెళ్ళిపోవాలన్న ఆత్రం మరింత పెరిగిందంటున్నారు. ఏపీలో ఇక్కడ బీజేపీలో ఉన్నాడా లేదా అన్నది చెప్పకుండానే, సంసారం ఒకరితో... శృంగారం మరొకరితో అన్నట్టు పవన్ ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: