శభాష్ డాక్టర్: 70 ఏళ్ల వయస్సులో 2 గోల్డ్ మెడల్స్?
ఆయన వయస్సు 70 ఏళ్లు. ఇప్పటికే 33 డిగ్రీలు ఆయన సొంతం. న్యాయశాస్త్రంలో అయిదు పీజీలు చేశారు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులోనూ ఆయన మరో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. తాజాగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో ఈ పతకాలు అందుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమక్షంలో ఇన్‌ఛార్జి వీసీ రాజశేఖర్ చేతుల మీదుగా కర్రి రామారెడ్డి ఈ బంగారు పతకాలు అందుకున్నారు.