గాంధీ సినిమా చూస్తూ.. గూండాగిరి చేసేశారు?
అహింస ప్రభోదించిన గాంధీ సినిమా చూస్తూ.. కొందరు విద్యార్థులు థియేటర్‌లో సీట్లు చించేశారు. తమ గూండాగిరి రికార్డు కాకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. థియేటర్ నిర్వాహకులు ఎంత మొత్తుకున్నా వారు కంట్రోల్ కాలేదు. చివరకు ప్రియా థియేటర్ మేనేజర్ మాజీద్ రజ్వీ పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. సినిమాలోని కొన్ని దృశ్యాల కారణంగానే విద్యార్థులు థియేటర్‌ను ధ్వంసం చేసినట్టు అనుమానిస్తున్నారు.