విజయ్, పూరీ: కన్నీళ్లు పెట్టుకున్న చార్మి?

Chakravarthi Kalyan
లైగర్ సినిమా ఇండియావ్యాప్తంగా ఈనెల 25న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత చార్మి.. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌లను ఇంటర్వ్యూ చేసింది. అందులో ఓ చోట నిర్మాత చార్మి కన్నీళ్లు పెట్టుకుంది.  

ఆమె విజయతో మాట్లాడుతూ.. 2019 ఆగస్టు నెలలోనే నేనూ పూరి మీకు కథ చెప్పాం. తర్వాత కరోనా వచ్చింది. ఆ తర్వాత వరుస లాక్‌ డౌన్‌లు.. ఈ కష్ట కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. లైగర్‌ను ఓటీటీకి అమ్మడానికి మంచి ఆఫర్‌ వచ్చింది. అప్పుడు జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. అంత భారీ ఆఫర్‌ వద్దనడానికి దమ్ము కావాలి. అలాంటి వ్యక్తే పూరి. ఆయన ఇది థియేటర్‌ ఫిల్మ్‌.. థియేటర్‌లోనే రిలీజ్‌ కావాలన్నారు. అలాంటి పూరి కూడా ఈ జర్నీలో కొన్నిసార్లు నిరాశ చెందారు. ఈ జర్నీలో రెండు విషయాలు ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. అందులో ఒకటి నువ్వు.. విజయ్‌ దేవరకొండ. ఇక రెండోది ఈ సినిమా కంటెంట్‌. అంటూ నిర్మాత ఛార్మి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: