ప్రధాని మోదీకి.. సీఎం కేజ్రీవాల్ బంపర్ ఆఫర్‌?

Chakravarthi Kalyan
అరవింద్‌ కేజ్రీవాల్‌.. పొలిటీషియన్‌గా మారిన ఈ మాజీ బ్యూరో క్రాట్ ఇప్పుడు దేశంలో కొందరికి ప్రత్యామ్నాయ రాజకీయాల పాలిటి ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. మొదట ఢిల్లీలో సత్తా చాటిన కేజ్రీవాల్ పార్టీ ఇప్పుడు పంజాబ్‌లోనూ అధికారం హస్తగతం చేసుకుని విస్తరణ వ్యూహంలో ఉంది. ప్రధాని మోదీ తీరుపై విమర్శలు గుప్పించే కేజ్రీవాల్‌ తాజాగా ప్రధానికి ఓ ఆఫర్ ప్రకటించారు.

దేశంలో విద్య, వైద్య సౌకర్యాలను మెరుగుపర్చాలని ప్రధాని భావిస్తే ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మన దేశంలో విద్య, వైద్య పథకాలను ఉచితాలుగా పరిగణించకూడని ప్రధానికి కేజ్రీవాల్  మరోసారి సూచించారు. పేదలకు మంచి విద్య అందకపోతే వారు పేదలుగానే మిగిలిపోతారని  కేజ్రీవాల్  తెలిపారు. దేశంలోని ప్రతి చిన్నారికి ఉచిత విద్య అందాలని, ప్రతి వ్యక్తి ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత వైద్యం అందించాలని  కేజ్రీవాల్  ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: