తెలంగాణ ఎస్సై ఉద్యోగాల పరీక్ష.. కీలక ప్రకటన?

Chakravarthi Kalyan
తెలంగాణలో ఇటీవల ఎస్సై పోస్టులకు రాత పరీక్ష జరిగింది. అయితే.. ఆ పరీక్షలో కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. వాటిని గుర్తించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆ ప్రశ్నలకు అందరికీ మార్కులు ఇస్తామని ప్రకటించింది. అయితే.. దీనిపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. దాంతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్సై ప్రాథమిక పరీక్ష కీ పై స్పందించింది.

సామాజిక మాధ్యంలో వచ్చే వదంతులు నమ్మొద్దని.. ఏ ఒక్క అభ్యర్థి కి నష్టం జరగకుండా రిక్రూమెంట్ బోర్డ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని వెల్లడించింది. పరీక్ష నిర్వాహణ, తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు  కలపడం అంతా పారదర్శకంగా జరుగుతుందని బోర్డు తెలిపింది. అధికారిక వెబ్సైట్ www.tslprb.in   ద్వారానే సమాచారం తెలుసుకోవాలని బోర్డు విజ్ఞప్తి చేసింది. ఈనెల 12వ తేదీన ప్రాధమిక పరిక్ష కీ విడదల చేసిన బోర్డు.. అభ్యంతరాల కోసం 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు అవకాశం కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: