స్టాక్ మార్కెట్ 'ఝున్‌ఝున్‌వాలా' హఠాన్మరణం?

Chakravarthi Kalyan
ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ ఝున్‌వాలా హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన ప్రముఖ వ్యాపార వేత్త కూడా. రాకేశ్‌ ఝున్‌ ఝున్‌వాలా ను స్టాక్ మార్కెట్‌లో బిగ్ బుల్ అంటారు. చిన్న సంస్థలను గుర్తించి పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు పొందడంలో రాకేశ్‌ ఝున్‌ ఝున్‌వాలా దిట్ట. అందుకే ఆయన్ను ‘వారెన్‌ బఫేట్‌ ఆఫ్‌ ఇండియా’ అని కూడా అంటుంటారు.
62 ఏళ్ల వయస్సున్న రాకేశ్‌ ఝున్‌ ఝున్‌వాలా ముంబయిలో గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. రాకేశ్‌ ఝున్‌ ఝున్‌వాలాకు గతంలోనే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయి. వాటికి తోడు మరికొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రాకేశ్‌ ఝున్‌ ఝున్‌వాలా కొన్ని వారాల క్రితమే ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో చికిత్స పొంది డిశ్ఛార్జి కూడా అయ్యారు.
కానీ.. మళ్లీ ఈ ఉదయం రాకేశ్‌ ఝున్‌ ఝున్‌వాలా ఆరోగ్యం క్షీణించింది. ఉదయం 6.45 నిమిషాలను కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ముంబయిలోని బ్రీచ్‌ కాండీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే రాకేశ్‌ ఝున్‌ ఝున్‌వాలా మృతి చెందినట్లు బ్రీచ్ కాండీ వైద్యులు ధ్రువీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: