
తెలంగాణలో నీటిపై పవర్‌ప్లాంట్.. ప్రారంభించనున్న మోదీ?
ఉజ్వల్ భారత్- ఉజ్వల్ భవిష్యత్- పవర్ 2047 ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ... రామగుండం, కేరళలోని ప్రాజెక్టులు జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలోని వంద మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టు జాతికి అంకితం చేయనున్నారు. కేరళలో 92మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టును కూడా జాతికి అంకితం చేస్తారు. అలాగే.. రాజస్థాన్‌లో 735మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు, లేహ్‌లోని గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్టుకు, గుజరాత్‌లోని కవాస్ గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ విత్ నేచురల్ గ్యాస్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు.