చినజీయర్ పై మళ్లీ అశ్వినీదత్‌ సంచలన వ్యాఖ్యలు?

Chakravarthi Kalyan
ఆధ్యాత్మిక వేత్త, స్వామీజీ చినజీయర్ స్వామిపై సినీ నిర్మాత అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. చంద్రబాబు వెయ్యికాళ్ల మండపం తొలగించినప్పుడు చినజీయర్‌ స్వామి ఆయన్ని తీవ్రంగా విమర్శించారని  సినీ నిర్మాత అశ్వినీ దత్ గుర్తు చేసుకున్నారు. ఆగమశాస్త్రం ప్రకారమే చంద్రబాబు ఆ మండపాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నా అప్పట్లో చినజీయర్ స్వామి దాన్ని తప్పుబట్టారని  సినీ నిర్మాత అశ్వినీ దత్ అన్నారు.

అయితే.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి.. ఈ మూడేళ్ల కాలంలో తిరుపతిని సర్వనాశనం చేసింది కదా.. మరి అవేమీ చినజీయర్ స్వామికి కనిపించవా అన్ని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వెంకన్న స్వామి ఇంకా ఆ పాపాలను ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదంటూ  సినీ నిర్మాత అశ్వినీ దత్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో బలవంతపు మతమార్పిళ్లు జరుగుతుంటే చినజీయర్‌ స్వామి ఎందుకు మాట్లాడటం లేదని  సినీ నిర్మాత అశ్వినీ దత్ ప్రశ్నించారు. ఆ మధ్య చినజీయర్ స్వామి జగన్‌ను దైవాంశ సంభూతుడని పొగిడారని.. ఆ మాటలు వినగానే నాకు కడుపు మండిపోయిందని అశ్వినీదత్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: