అమెరికాకు బిగ్‌ షాక్ ఇవ్వనున్న చిన్న దేశాలు?

Chakravarthi Kalyan
ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. డాలర్ విలువ పెరుగుతోంది. దీంతో అమెరికా నుంచి ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్న దేశాలు ఆ రుణాలు కొండల్లా పెరిగిపోయి కట్టలేకపోతున్నాయి. దీంతో ఎగవేయడం తప్ప వాటికి మార్గం లేకుండా పోతోంది. ఇప్పటికే పలు లాటిన్‌ అమెరికా దేశాలు రుణ కిస్తీలను కట్టలేక ఎగనామం పెట్టేశాయి.

ఇలా పలు వర్ధమాన దేశాలు రాగల ఏడాదిలో 25,000 కోట్ల డాలర్ల రుణ బకాయిలను కట్టాల్సిఉంది. ఇటీవలే  శ్రీలంక కూడా రుణ కిస్తీల ఎగవేసింది. ఇక ఇప్పుడు పాకిస్థాన్‌, ఈజిప్ట్‌, ఘనా, ట్యునీషియాలు వంటి దేశాలు కూడా ఎగవేతకు పాల్పడే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ దేశాల విదేశీ రుణాల్లో 20 శాతాన్ని త్వరలోనే తీర్చాల్సిన గడువు దగ్గరకు వచ్చింది. అందుకే ఆ దేశాలు కూడా ఎగవేత మార్గం పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పుల భారంతో ఇటీవల ఎల్‌ సాల్వడార్‌ బిట్‌ కాయిన్‌ను అధికార కరెన్సీగా ప్రకటించింది కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa

సంబంధిత వార్తలు: