Breaking: యాక్షన్ కింగ్ అర్జున్ అమ్మగారు కన్నుమూత!

Purushottham Vinay
తెలుగు, తమిళ ఇంకా అలాగే కన్నడ ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఇక ఆయన తల్లి లక్ష్మీ దేవమ్మ గారు ఈ రోజు కన్నుమూశారు.ఆమె వయసు వచ్చేసి 85 సంవత్సరాలు.లక్ష్మీ దేవమ్మ గారు విద్యావంతురాలు. కర్ణాటకలోని మైసూర్ లో స్కూల్ టీచర్ గా కూడా కొన్ని రోజులు పని చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఇంకా ఓ కుమార్తె. ఈ కుమారులలో ఒకరు అర్జున్. లక్ష్మీ దేవమ్మ మనవరాలు ఇంకా మనవళ్లు కూడా చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లుగా సినిమాలు చేస్తున్నారు.



ఇక అర్జున్ కుమార్తె ఐశ్వర్య కథానాయికగా సినిమాలు చేస్తున్నారు. ఆమెను తెలుగు తెరకు పరిచయం చేస్తూ టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా అర్జున్ స్వీయ దర్శకత్వంలో ఇటీవల ఒక సినిమా కూడా మొదలైంది. అలాగే అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా కన్నడ హీరో. మరో మేనల్లుడు చిరంజీవి గారు కొంత కాలం క్రితం గుండెపోటు కారణంగా మృతి చెందారు.ప్రస్తుతం లక్ష్మీ దేవమ్మ గారి పార్థీవ దేహం బెంగళూరు అపోలో ఆసుపత్రిలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: