మేడపై ఈ మొక్కలు పెంచుకుంటే ఎంతో ఆరోగ్యం?

Chakravarthi Kalyan
ఇంటిపైన కూరగాయల సాగు ఇపుడు కొత్త ట్రెండ్. వాటితో పాటు కొన్ని ఔషధ మొక్కలు కూడా పెంచుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. రోడ్డుపక్క కనిపించే నేలఉసిరిని పచ్చకామెర్ల చికిత్సలో ఉపయోగిస్తారు. మానసిక రుగ్మతల చికిత్సలో జటామాంసి, అశ్వగంధి, బ్రహ్మి, జలబ్రహ్మి, శంఖపుష్పిని వాడుతున్నారు. సుంగంధపాల, అత్తాకోడళ్ల చెట్టు, ముళ్ల గోరింట, పాలబర్రంకి, మగలింగ మొక్క, కొండపిండి, ఉత్తరేణి ఇవన్నీ అరుదైన ఔషధగుణాలున్న మొక్కలే.
 
కలుపుజాతి కి చెందిన గడ్డి చేమంతి  మొక్కను ఎగ్జిమా నివారణకు శక్తిమంతంగా పనిచేస్తుంది. ఆదివాసీలు పశువుల గాయాలు, పుండ్లకు వ్కెద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు.
అశ్వగంధ, తిప్పతీగ, శతావరి, బోడతరము, చిత్రమూలము, నేలతంగేడు, పసుపు, పాలసుగంధి, సరస్వతి, అడ్డసర వంటివి పెరట్లో, పొలాల్లో పెంచుకుంటే వైద్యుడి తో పని ఉండదు. ఈ మొక్కలనే కాదు.. మిద్దె మీద కానీ.. వరండాలో కానీ.. నాలుగు మొక్కులు కుండీల్లో పెంచుకుంటే.. వాటిని రోజూ పరిశీలిస్తుంటే ఎంతో మానసిక ఆనందం కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: