కాసుకో ఇండియా.. చైనా బిగ్ వార్నింగ్‌..?

Chakravarthi Kalyan
పొరుగున ఉన్న చైనా ఇండియాను మరోసారి భయపెడుతోంది. గతంలో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఏకంగా ఓ గ్రామం నిర్మించి ఇండియాకు సవాల్ విసిరిన చైనా ఇప్పుడు సిక్కిం సరిహద్దుల్లో అలాంటి ప్రయత్నమే చేసి.. ఇండియాకు పరోక్షంగా సవాల్ విసురుతోంది. ఐదేళ్ల క్రితం భారత్‌-చైనా దళాలు ముఖాముఖీగా తలపడిన డోక్లాం సమీపంలోని ఇప్పుడు చైనా ఓ గ్రామాన్నే నిర్మించింది. అమోచూ ప్రాంతం వద్ద భారత్-చైనా-భూటాన్ ట్రైజంక్షన్‌కు దగ్గరగా ఈ గ్రామాన్ని చైనా నిర్మించింది.

పాంగ్డా అనే ప్రాంతం వ్దద చైనా నిర్మించిన గ్రామం ఉప గ్రహ చిత్రాలు ఇప్పుడు వెలుగు చూశాయి. మక్సర్‌ అనే సంస్థ  ఈ ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. 10 కిలోమీటర్ల మేర భూటాన్‌ భూభాగాన్ని ఆక్రమించిన చైనా డోక్లాం ప్రాంతానికి సరిగ్గా 9 కిలోమీటర్ల దూరంలో పాంగ్డా గ్రామాన్ని నిర్మించింది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాల్లోని ప్రతి ఇంటి ముందు ఓ కారు పార్క్‌ చేసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: