కేసీఆర్ నక్క..? మోడీ నాగలోకం..?
కోన్ కిస్కా గొట్టం కేసీఆర్ కు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలా అని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ప్రశ్నలకు మెదట కేసీఆర్ సమాధానం చెప్పాలని.. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పెరుగుతుందని... టీఆర్ఎస్ గ్రాఫ్ అంతే వేగంగా పడిపోతుందని బండి సంజయ్ అన్నారు. మేము నోరు విప్పితే కేసీఆర్ కు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదన్న బండి సంజయ్.. సొంత ప్రభుత్వ అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే కేసీఆర్ మోడీపై విమర్శలు చేస్తున్నారన్నారు.