ఆ రెండు రోజులు హైదరాబాద్లో సందడే సందడి?
ఈనెల 18 న మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25 న ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రధాన దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని.. చార్మినార్ వద్ద 500 మంది కళాకారులతో కళాప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తలసాని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు సిబ్బంది ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.