2.5 లక్షల ఉద్యోగాలు.. యువతపై పవన్ వల?

Chakravarthi Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ యువతపై వల వేస్తున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తన ఎజెండాను క్రమంగా బయటపెడుతున్నారు. జనసేన అధికారంలోకి వస్తే.. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తానని బాపట్ల జిల్లా పర్చూరులో ప్రకటించారు. డిగ్రీ అయ్యాక యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుందని.. కానీ ఏపీలో జాబ్‌ క్యాలెండర్‌ లేదని... దీన్ని ప్రశ్నించటం తప్పా పవన్ అంటూ ప్రశ్నించారు.
ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, ఇబ్బందులు పాల్జేయడం జగన్‌ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని పవన్‌ విమర్శించారు. అధికారంలోకి వస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని, 2.50 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని జగన్ చెప్పారని.. ఇప్పుడు వాటి ఊసేత్తడం లేదని పవన్ విమర్శించారు.
 తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా 2.50 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని పవన్ కల్యాణ్‌ హామీ చెప్పారు. నిరుద్యోగ యువతకు రూ. 10 లక్షల చొప్పున ఇస్తే పది మందికి స్వయం ఉపాధి దక్కుతుందనేది జనసేన ఆలోచన అని పవన్ కల్యాణ్ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: