ఇక జగన్‌ను ఆ దేవుడు కూడా క్షమించలేడా?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్‌ లెక్కకు మించి తప్పులు చేస్తున్నాడని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. జగన్ దేవుడు కూడా క్షమించనన్ని తప్పులు చేస్తున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ వైఖరితో ఇక ఓపిక నశించి తాడో పేడో తేల్చుకునే స్థాయికి వచ్చేశామని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. ఏపీలో దేశ పౌరులకుండే హక్కులేవీ తమకు లేకుండా పోతున్నాయని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ నేతలను కావాలనే సీఎం జగన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. అదే సమయంలో వైసీపీ నాయకుల దాడులపై పోలీసులు ఒక్క చర్యా తీసుకోవడం లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్ వరుసగా టీడీపీకి చెందిన బీసీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని... బీసీ వ్యతిరేకిగా జగన్ మారిపోయారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్ వరుసగా చేస్తున్న తప్పులను గమనిస్తే.. ఇకపై జగన్‌ను ఆ దేవుడు కూడా క్షమించే అవకాశం లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: