అగ్నిపథ్‌ పై కీలక నిర్ణయం..10% రిజర్వేషన్‌?

Chakravarthi Kalyan
అగ్నిపథ్ .. ఇటీవల సైన్యంలో ఎంపికల కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన పథకం తీవ్ర విమర్శల పాలైంది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నాలుగేళ్ల సర్వీసు తర్వాత తమ భవిష్యత్ ఏంటన్న ఆందోళన అగ్నిపథ్‌ ఆశావహులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రతిపాదించిన అగ్నిపథ్‌ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైర్‌ అయిన అగ్నివీరులకు రక్షణ శాఖకు చెందిన వివిధ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు.. అంటే సీఆర్‌పీఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌ వంటి సంస్థల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తారు. కేంద్ర హోంశాఖ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. అంతే కాదు.. ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ వీరికి మూడేళ్ల సడలింపు ఇస్తారు. తొలిబ్యాచ్‌ అగ్నివీరులకుమొత్తంగా ఐదేళ్ల సడలింపు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: