తెలంగాణ ఆర్టీసీ డీలా.. ఏపీ ఆర్టీసీ ఖుషీ ఖుషీ?

Chakravarthi Kalyan
తెలంగాణ ఆర్టీసీ ఇటీవల అనేక సార్లు రేట్లు పెంచింది. డీజిల్ సెస్ అని ఓసారి.. రౌండప్ చార్జీలు అని మరోసారి.. మళ్లీ డీజిల్ సెస్‌ అని ఇంకోసారి ఇలా తక్కువ సమయంలోనే బాగా రేట్లు పెంచింది. అయితే.. ఈ రేట్ల ప్రభావం.. ఏపీ, తెలంగాణలో తిరిగే రూట్లపై పడింది. రెండు రాష్ట్రాల ఒప్పందంలో భాగంగా కొన్ని తెలంగాణ బస్సులు కూడా ఏపీలో తిరుగుతుంటాయి. అయితే.. ఏపీలో చార్జీలు పెంచకపోవడం వల్ల.. ఆంధ్రా ప్రాంతాలకు వెళ్లే తెలంగాణ బస్సులకు గిరాకీ తగ్గింది. ఏపీ బస్సుల్లో తక్కువ చార్జీలు ఉండటం వల్ల ప్రయాణికులు ఏపీ బస్సులనే ఎక్కుతున్నారు. దీంతో ఏపీ బస్సులు ఆదాయం బాగా పెరిగింది. తెలంగాణ బస్సుల మాదిరిగా ఏపీ బస్సుల్లో చార్జీలు పెంచకపోవడం వల్ల ఏపీ ఆర్టీసీకి ఆదరణ పెరిగిందని ఏపీఎస్‌ ఆర్టీసీ ఈడీ చెబుతున్నారు. విజయవాడ- హైదరాబాద్ మార్గంలో రోజుకు రూ. 4-5 లక్షల వృద్ధి కనిపిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: