జగన్‌ వచ్చాడు.. వెళ్లాడు.. ఏం ఒరిగింది..?

Chakravarthi Kalyan
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా పర్యటనపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. సీఎం జగన్ వచ్చాడు.. వెళ్ళాడు.. అన్న చందంగా ఈ పర్యటన ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నిస్సహాయంగా, నిస్సవత్తువుగా సాగిందని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. జిల్లాలోని సాగునీటి  ప్రాజెక్టుల ఆధునీకరణ పనులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు మెదపకపోవడం దుర్మార్గమని కాల్వ శ్రీనివాసులు అన్నారు.

జీడిపల్లి, బిటిపి, పేరూరు హంద్రీనీవా పథకాల గురించి ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించలేదని కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. దేశంలో రైతు ఆత్మహత్యలు చేసుకోవడంలో ఆంధ్ర రాష్ట్రం 2 వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యలు 3 వ స్థానం నిలిచిందని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఇందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనే కారణమని కాల్వ మండిపడ్డారు. అదే టీడీపీ హయాంలో రైతులకు రూ. 1126 కోట్లు  ఇన్ పుట్ సబ్సిడీ అందించామన్నారు. రైతు సంక్షేమం కోసం టీడీపీ హయాంలో రూ. 11 వేల కోట్లతో రైతులకు డ్రిప్ పరికరాలు అందించామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: